గత పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిన విశాఖ ఉక్కు పరిశ్రమలో బిడ్ దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఈ పరిశ్రమ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) బిడ్‌కు ఆహ్వనం పలికిన విషయం తెలిసిందే.
మొత్తం 29 సంస్థల తరఫున బిడ్లు రాగా, ఇందులో విదేశీ సంస్థలకు చెందినవి ఏడు బిడ్లు ఉన్నట్లు అనధికార వర్గాలు వెల్లించాయి. కాగా, తెలగు ప్రజలు, అఖిల పక్షం ఊహించినట్లుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ బిడ్‌లో పాల్గొనలేదు.
బీడ్ లో పాల్గొని విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకట్ట వేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు ఈ విషయంలో తోకముడిచి నట్లయింది. సింగరేణి కాలరీస్ నుండి అధికారుల బృందాన్ని ప్రత్యేకంగా విశాఖకు పంపి, బీడ్ విషయమై అధ్యయనం కూడా చేయించారు. సింగరేణి కాలరీస్ కోరడంతోనే బీడ్ దాఖలుకు గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించారు.
ఎన్ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదు. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేశారు. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ ఒక చిట్కా వైద్యాన్ని వెల్లడించడం చర్చనీయాంశం అయింది.
ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేకపోవడంతో కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారంటూ భారీ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్తదేనని తేలిపోయింది.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) బిడ్జింగ్ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపైనా కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఈ విషయంతో బీఆర్ఎస్ సర్కార్ మాటలన్నీ కోతలేనని తేలిపోయిందని పేర్కొన్నారు.
మరోవైపు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3న మరోవైపు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది.