రెండ్రోజులపాటు గడువిచ్చిన వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీఢనం కారణంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో, ఏపీలో మరో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పిగుడులు పడ్డాయి. వాసుదేవనగర్ అపార్ట్మెంట్ మధ్యలో పిడుగుపడింది. ఒ వ్యక్తి అపార్ట్మెంట్లోకి వెళ్తుండగానే అతని పక్కనే పిడుగుపడడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. అదృష్టవశాత్తు అతను పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడని ఇది చూసిన చాలామంది అంటున్నారు.
దీంతో అత్తాపూర్ చుట్టుపక్కల ఇండ్లలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది. చాలా ఇండ్లలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌ని వాతావరణ శాఖ జారీ చేసింది. మరో వైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది. మరో వైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షంధాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలాచోట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించారు.
భారీ వర్షంతో డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. అవసరముంటే 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్ఎఫ్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.
కాగా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు హై స్కూల్ సమయం ఉండనుంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు ప్రైమరీ స్కూల్స్ ఉండనున్నాయి. హైదరాబాద్ మినహా ఇతర అన్ని జిల్లాల్లో ఈ మార్పులు ఉంటాయని విద్యాశాఖ ప్రకంటిచింది.