ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఎంపీ ఇంట్లోకి ఈడీ అధికారులు ప్రవేశించారు.
లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా తర్వాత ఆప్ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ సింగ్‌ను విచారిస్తున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన 2021 మద్యం విధానంలో లోపం ఉండడంతో దాన్ని రద్దు చేశారు. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఏప్రిల్‌లో సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తనను కూడా ఈడీ విచారిస్తుందని గతంలోనే సంజయ్ సింగ్ తెలిపారు. ఆయన తన ఇంటి ముందు వెల్కమ్ ఈడీ అని పోస్టరు కూడా ప్రదర్శించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అభిషేక్ బోయిన్పల్లి, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనువాసులు రెడ్డి, ఎంఎల్ సి కవిత తదితరలను విచారించిన విషయం విధితమే.