తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మక కా ళేశ్వర ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో అపశ్రుతి చోటు చేసుకుంది.శనివారం లక్ష్మీ(మెడిగడ్డ) బ్యారేజ్ చెందిన 20వ పిల్లర్ స్వల్పంగా కుంగింది. దీంతో అంతట ఆందోళన వ్యక్త మైంది. సాయంత్రం సుమారు 6.30గంటల కుంగే సమయంలో భారీ శబ్ధం వినబడింది.
దీంతో అక్కడే రెగ్యూలర్ మొయింటెన్స్ చేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో హూట హూటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. సుమారు రెండు గంటల సమయం వరకు రాకపోకలను బంద్ చేయించారు అధి కారులు.
అనంతరం ఇరిగేషన్, పోలీసులు బ్యారేజ్ వంతెనను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క వా హనం వెళ్లాడానికి అనుమతి ఇచ్చారు.మరో వైపు ఇటు 20 వ పిల్లర్ కుంగడంతో దాని ప్రభావం ప్రధానంగా 19,21 పిల్లర్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనావేశారు.
లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగే సుమయంలో భారీ పేలుడు లాంటి శబ్ధం సూమారు కిలోమీటర్ మేర వినపడిందని అధికారులు చె బు తున్నారు. ఈ నేపథ్యంలో శబ్ధం వెనుక ఏమైనా అంసాఘిక శ క్తు లు ఉన్నాయా అనే కోణంలో అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర సిరోంచ పో లీసులకు, ఇటు మహాదేవ్‌పూర్ పో లీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పో లీ సు లు దీనిపై విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ నుండి క్లూ స్ టీం, ఇతర బృందాలుబ్యారేజీతో పాటు చుట్టూ పరిశీలి స్తున్నా రు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఈ బ్యారేజీ కుంగుబాటుపై నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టును 2019లో ఎల్ అండ్ టీ నిర్మించిందని గుర్తు చేశారు. డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని వివరించారు. ఈ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు వచ్చిందని స్పష్టం చేశారు.
కాగా, లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ని ఎల్‌అండ్‌టి నిర్మించిందని, గత ఐదు వరద సీజన్లను బ్యారేజీ తట్టుకుందని ఎల్ అండ్ టి జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ వెల్లడించారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ భద్రతపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రాష్త్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీని పిలిపించి, ప్రాజెక్టును పరిశీలించే విధంగా చర్యలు చేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తి ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా దీనిని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రారంభించిన మూడేండ్లలోనే ఈ ప్రాజెక్టులో కొంతభాగం కుంగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.