టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని, కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
చంద్రబాబుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని, బెయిల్ ఇవ్వొద్దని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పునున వెల్లడించారు.
డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.