తెలంగాణ ఎన్నికల బరిలో సీపీఎం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పొత్తు కోసం ఎదురు చూసినప్పటికీ..అటు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక ఎదురుచూసి ప్రయోజనం లేదని ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు 17 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది.
మొత్తం 20 స్థానాల్లో పోటీ చేస్తామన్న సీపీఎం ప్రస్తుతానికి 17 స్థానాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. త్వరలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు.
సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు
ఖమ్మం: పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి; భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, అశ్వారావుపేట; నల్గొండ: మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్;
యాదాద్రి భువనగిరి: భువనగిరి. సూర్యాపేట: హుజూర్నగర్, కోదాడ;
జనగామ: జనగామ; రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం; సంగారెడ్డి: పటాన్చెఱు;
హైదరాబాద్: ముషీరాబాద్.
‘‘ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో 8 సార్లు వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేము పట్టుపట్టం. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. మేము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు మేము ఒకే అన్నాం. కాంగ్రెస్తో పొత్తుల అంశంలో చాలా మెట్లు మేము దిగాం. వైరా ఇస్తామని…మళ్ళీ మాట మార్చి ఇస్తామని అనలేదు అంటూ భట్టి విక్రమార్క అబద్ధం అడారు” అంటూ వీరభద్రం మండిపడ్డారు.
అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని ఆయన స్పష్టం చేశారు. పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంటుందని ధ్వజమెత్తారు. “పొత్తుల బ్రేకప్ మేము కోరుకుంది కాదు. ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు తీసుకోవడం సీపీఎం పార్టీ విధానం కాదు. సీపీఎం ఆనాడే ప్రధాని పదవిని సూత్రప్రాయంగా వదిలివేశాం” అని తెలిపారు.
అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తారమని చెబుతూ బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. బీజేపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లలో తాము పోటీ చేయమని పేర్కొంటూ కమ్యూనిస్టులు లేని శాసనసభలు దేవుడి లేని దేవాలయాలు లాగా ఉంటాయని తమ్మినేని ఘాటుగా పేర్కొన్నారు.