ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి జరిపిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రెండు గ్యారంటీలలో రెండింటిని వెంటనే అమలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులను రాష్ట్రంలో సోనియాగాంధి జన్మదినమైన శనివారమ నుండే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిని రూ 10 లక్షలకు పెంచుకు నిర్ణయించారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధిక పరిస్థ్దితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా వి ద్యుత్ రంగం పరిస్థితులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది.
మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదేశించినట్లు చెప్పారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.
అదే విధంగా వ్యవసాయం రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, గృహాలకు 200 యూ నిట్ల ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంపై కూడా చర్చించినట్లు చెబుతూ ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లతామని తెలిపారు.
మంత్రులకు శాఖల కేటాయింపులపై సిఎం, హైకమాండ్ నిర్ణయం తీ సుకుంటుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయంపై కూడా చర్చించాని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు శుభాకాంక్షలు.
కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన ఉంటుందని, ముందుగా స్పీకర్ ఎన్నిక తరువాత సభ్యులతో ప్రమాణం స్వీకారం గవర్నర్ తమిళిసై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు చెప్పారు.