వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘కాక్క’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక మంచి పేరు తెచ్చుకుంది. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాథక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్మర్ సల్మాన్ వంటి చిత్రాల్లో ఆమె నటించింది.
లక్ష్మిక చివరిసారిగా నవంబర్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి ఒక అందమైన ఫోటోను ఆమె షేర్ చేశారు. ”హోప్. లైట్ డిస్పయిట్ ఆల్ ఆఫ్ ది డార్కెనెస్” అంటూ ఆమె చేసిన పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి ఇప్పుడు స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో నలుగురు మలయాళ నటీమణులు మరణించడం, వీరిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైన తరుణంలో చిన్న వయస్సులోనే లక్ష్మిక గుండెపోటుతో మరణించిందన్న వార్త మాలీవుడ్‌ను మరోసారి దుఃఖ సాగరంలో ముంచేసింది.
ఈ వార్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం మిగిల్చింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీకా మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
కన్నడ నటి లీలావతి కన్నుమూత
ప్రముఖ కన్నడ నటి లీలావతి (85) శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె బెంగళూరు శివారులోని నీలమంగళలో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె 600కుపైగా కన్నడ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు.
‘చంచల కుమారి’తో సినీ అరంగేట్రం చేసిన లీలావతి దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించారు. ‘భక్త కుంబర’, ‘సంత తుకారామ్’, ‘భక్త ప్రహ్లాద’, ‘మాంగల్య యోగ’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు గొప్ప ప్రజాదరణ లభించింది. తెలుగులో ఆమె వాల్మీకి, మర్మయోగి, ఇది కథ కాదు, కార్తీకదీaపం, మరోమలుపు తదితర చిత్రాల్లో నటించారు.