సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడపడనున్నారు అలాగే అవసరమైతే సర్వీసులు పొడిగింపు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు పండగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. పండగ సీజన్లో బస్సులు, రైళ్లు రద్దీగా ఉండటం సహజం. ప్రయాణంలో కనీసం నిల్చోవటానికి కూడా ఖాళీ స్థలం ఉండదు.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్ లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్-తిరుపతి (07489/07490) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుటుందని చెప్పారుతిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్- తిరుపతి (07449/07450) మరో స్పెషల్ ట్రైన్ ఈ నెల 27వ తేదీ సా. 6.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు తిరుపతి తీసుకుంటుందన్నారు.తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు.
హైదరాబాద్-కాకినాడ (074ఏ51/ఏ074ఏ5ఏ2) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసఏటిరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను బట్టి ట్రైన్ సర్వీసులు పొడగిస్తామని అధికారులు చెప్పారు