కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు నీటి రుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రం ప్రతిపాదించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్టు మంత్రులు వివరించారు. తాను నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న నియోజకవర్గం నుంచి ఎంపిగా, ఎంఎల్ఎగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించానని, సమస్య ఏమిటో తనకు తెలుసని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఎపిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించి రాయలసీమకు నీటిని తీసుకుపోతుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎపి సిఎం జగన్‌తో కలిసి అలయ్‌బలయ్ అడి ది, ఏకాంత చర్చలు జరిపింది కెసిఆర్ కాదా? అని నిలదీశారు
ఉప ముఖ్యమత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించామని, రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం, అయితే గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాలను భారీగా పెంచిందని విమర్శించారు. 2104నాటికి ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు రూ.1400కోట్లతో 3.32 లక్షల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యంగా పెట్టుకోగా, దీని అంచనాలు రూ.18వేలకోట్లకు పెంచారని తెలిపారు. కొత్తగా ఆయకట్టు మాత్రం ఒక్క ఎకరా కూడా పెంచలేదన్నారు.
రాజీవ్ సాగర్ ప్రాథమిక అంచనా రూ.1680కోట్లుకాగా, ఉమ్మడి ఎపిలోనే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం రూ.889కోట్లు ఖర్చు చేసిందని, మిగతా రూ.792కోట్లు ఖర్చు చేయాల్సి ఉండేదని వివరించారు. ఇందిరా సాగర్ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా రూ.1824కోట్లు కాగా, ఉమ్మడి ఎపిలోనే దీనిపై రూ.1064కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మిగిలిన పనులకు రూ.760కోట్లు ఖర్చు చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు.
రాజీవ్‌సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు మొత్తం రూ.1552కోట్లు ఖర్చు చేసి వుంటే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయివుండేవని చెప్పారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రీడిజైన్ పేరుతో ఈ రెండు ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టు అని పేరుపెట్టారని, దీని అంచానాలు రూ13057కోట్లకు పెంచారని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు వేల కోట్లు వ్యయం చేసినా అదనపు ఆయకట్టు కూడా ఏమి పెంచలేదని ఆయన ధ్వజమెత్తారు.
మొత్తం మూడు ప్రాజెక్టులను రీడిజైన్ల పేరుతో అంచనాలు 22981కోట్లకు పెంచారని తెలిపారు. అందులో రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వలేదన్నారుని చెబుతూ మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదని తెలిపారు.