దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన ఈడీతో పాటు పాటు ఐటీ అధికారులు సుమారు ఐదు గంటలసేపు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది.
కవితకు సంబంధించిన రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో కవితను తీసుకెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలిపారు..
మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కవిత అరెస్ట్ వార్తల నేపథ్యంలో సమాచారం అందుకున్న కేటీఆర్, హరీశ్ రావు వెంటనే కవిత నివాసానికి చేరుకున్నారు.
అయితే కవిత ఇంటి గేట్లను మూసివేయించిన అధికారులు ఎవరిన్ని కూడా లోపలికి అనుమతించలేదు. కవిత తరపు అడ్వొకేట్ సోమ భరత్ ను కూడా లోపలికి అనుమతించలేదు.