బెంగళూరు బాంబు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. . ‘ఎక్స్’లో నిందితులు ఇద్దరి ఫొటోలు, వివరాలను శుక్రవారం ఫోస్టు చేసింది. ముస్సావీర్ హుసేన్ షాబిన్ (30), అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా (30) ఆచూకీ చెప్పాలని కోరింది.
వారి వివరాలను ప్రకటించింది. ఇద్దరి ఆచూకీ తెలిపితే తలా రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది . ఇద్దరు అనుమానితులు ముసావిర్ హుస్సేన్ , అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలలు ఇప్పుడు ఎన్ఐఏ వాంటెడ్ జాబితాలో చేరారు.
ఈ ఇద్దరు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు కుట్ర పన్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. ఫరారీలో ఉన్న ఈ ఇద్దరి జాడకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇద్దరు నిందితులు 2020 టెర్రరిజం కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నారు. దేశంలో ఎక్కడైనా ఎవరికైనా వీరి గురించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు నేరుగా కానీ ఇన్ఫో ,ఎన్ఐఎ @గవ్. ఇన్ ద్వారా కానీ తెలియచేయవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ తమ పేర్లు మార్చుకుని పలు ప్రాంతాలలో తిరుగుతున్నట్లు నిఘా వర్గాలకు తెలిసింది. వీరి పట్టుకుంటే పేలుడు ఉదంతంలోని కీలక విషయాలు మరింతగా వెలుగులోకి వస్తాయి.