నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకినట్లు భారత వాతావరణ శాఖప్రకటించింది. రుతుపవనాలు ప్రస్తుతానికి మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని పేర్కొంది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 19న భారత భూభాగాన్ని తాకాయి.
ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మే 22 వరకు అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి.
ప్రతియేటా మే 18 -20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీ మాన్ సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది.
మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టం నకు 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగేయ / నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కలదు.