నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోశనివారం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం క్యూ లైన్ నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి కిందికి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లావాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిని కుటుంబ సభ్యులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాంపల్లిలో శుక్రవారం సాయంత్రం నుంచే చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషనల్ కు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి వచ్చారు.
టోకన్ల కోసం క్యూ లైన్లో నిలబ్బారు. అయితే నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57).. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లో నిలబడి ఉండగా.. రద్దీ పెరిగి క్యూలైన్లో జరిగిన తోపులాటతో స్పృహ తప్పి పడిపోయాడు.అక్కడకు చేరుకున్న మహిళా పోలీసు స్పృహతప్పిన వ్యక్తిపై నీళ్లు చెల్లింది. వ్యక్తి స్పందించలేదు. సీపీఆర్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో అంబులెన్స్ ను పిలిపించారు.
వెంటనే అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గమనించిన సిబ్బంది.. అతన్ని హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు. ఈ కార్య్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ చేప ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవటం వల్ల ఆసమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపశమనం దొరుకుతుందని ప్రజల నమ్మకం.