టిడిపి అధినేత తన మంత్రివర్గంలో సీనియర్ నాయకులకు దాదాపుగా మొండిచెయ్యి చూపించారు. కొత్తవారికి పెద్ద పీట వేశారు. మొత్తం 24 మంది మంత్రులలో 17 మంది కొత్తవారే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా చేరుతున్నారు. జనసేన నుండి ముగ్గురు, బిజెపి నుండి ఒకరు మంత్రివర్గంలో చేరుతున్నారు.
ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు.
- నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)
- కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)
- కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
- కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
- నాదెండ్ల మనోహర్ (తెనాలి)
- పి.నారాయణ (నెల్లూరు సిటీ)
- వంగలపూడి అనిత (పాయకరావుపేట)
- సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
- నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
- ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)
- ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
- పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
- అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
- కొలుసు పార్థసారధి (నూజివీడు)
- డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)
- గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
- కందుల దుర్గేష్ (నిడదవోలు)
- గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
- బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)
- టీజీ భరత్ (కర్నూలు)
- ఎస్.సవిత (పెనుకొండ)
- వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
- కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
- నారా లోకేష్ (మంగళగిరి)