* జిన్‌పింగ్‌కు గుండెనొప్పి వచ్చిందా! ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
జియాంగ్షులోని నాన్టోంగ్ పట్టణంలో 16 కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది. నియామకాలు పొందిన 168 మంది మహిళలు, ముందస్తు ఫిజికల్ టెస్ట్‌లు చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్స్ గుర్తించారు. దర్యాప్తులో భాగంగా రెండు ప్రధాన దవాఖానలను, ఒక మెడికల్ ఎగ్జాం సెంటర్‌కు వెళ్లి ప్రాసిక్యూటర్స్ విచారించారు.
ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోయినా, పిల్లల్ని కనాలనుకునే ఉద్దేశమున్నా, గర్భంతో ఉన్నా.. అలాంటి మహిళలను ఇం టర్వ్యూ దశలోనే చైనాలోని పలు కంపెనీలు పక్కకు తప్పిస్తున్నాయి. వారికి ఉద్యో గం ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి. ప్రెగ్నె న్సీ టెస్ట్‌లు అడుగుతున్నాయి. అయితే ఇలా చేయటం చైనా చట్టాల ప్రకారం నేరం. ప్రెగ్నెన్సీతో ఉన్న కార్మికుల పట్ల వివక్ష చూపరాదు.
ఇలా ఉండగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెనొప్పి వచ్చిందా? అంటే అవుననే అంటున్నది ఆ దేశ సామాజిక మాధ్యమం. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన స్ట్రోక్‌కు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నది. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
ఆయనకు స్ట్రోక్ వచ్చిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించ లేదు. ఆయనకు స్ట్రోక్ వచ్చినట్టు జెన్నిఫర్ అనే రిపోర్టర్ వెల్లడించారు. 2021లో కూడా జిన్‌పింగ్ సెరిబ్రల్ ఎన్యూరిజంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందారు.