డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామామద్దతు తెలిపారు. ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్ తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు.
అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలాహ్యారిస్ కు మద్దతు ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
మాజీ తొలి దంపతుల నుంచి హ్యారిస్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మిచెల్‌తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని, ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని బరాక్ ఒబామా తెలిపారు. కమలా నీ పట్ల గర్వంగా ఉందని, నువ్వు చరిత్ర సృష్టిస్తావని మిచెల్ ఆ ఫోన్ కాల్లో తెలిపారు.
“నేను, మిషెల్ మా స్నేహితురాలు కమలా హారిస్‌కు కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశాం. ఆమె అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం. ఆమెకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు తెలియజేశాం. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో కమల గెలవడానికి ఏమైనా చేస్తాం. మీరు కూడా మాతో చేరుతారని ఆశిస్తున్నాం” అంటూ కమల హారిస్‌తో ఫోన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు బరాక్ ఒబామా.
“మీకు మద్దతు ఇచ్చే విషయంలో మిషెల్, నేను ఎంతో గర్వపడుతున్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని ఓవల్ ఆఫీస్‌కు పంపే విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తాం” అని కమలతో ఒబామా ఫోన్ కాల్లో మాట్లాడారు. “మీ విషయంలో గర్వంగా ఉంది. ఇది చారిత్రకం కానుంది” అని మిషెల్ అన్నారు. వారికి వెంటనే కమలా హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. “ఇది నాకు ఎంతో విలువైంది” అని బదులిచ్చారు.