మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు తాను తలపెట్టిన బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతారని కధనాలు వెలువడినప్పటికీ చెప్పుకోదగిన నేతలు ఎవ్వరిని కలవలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కూడా సమావేశం జరగలేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్లి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితర నేతలతో పాల్గొంటారని కధనాలు వచ్చినా ఆయన వారణాసి వెళ్లనే లేదు.
అయితే ఆసక్తి కరంగా గురువారం రాజ్యసభ ఎంపి, బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్, న్యూఢిల్లీలోని క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కెసిఆర్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం చర్చనీయాంశమైంది.
రాజ్యసభ సభ్యతం మరొకొన్ని నెలలో ముగియనున్న స్వామిని తిరిగి రాజ్యసభకు పంపే ఆలోచన బీజేపీలో కనిపించడం లేదు. పైగా, గత ఏడాది పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా ఆయనకు స్థానం ఇవ్వలేదు. ఆయన మమతా బనెర్జీ వచ్చిన సందర్భంగా కూడా ఇంతకు ముందు ఢిల్లీలో కలిశారు.
వారిద్దరితో కలసి కేసీఆర్ మధ్యాహ్నం విందు చేశారు. టి ఆర్ ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, తెలంగాణ ప్లానింగ్ బోర్డు చైర్మన్ బి వినోద్ కుమార్, ఎమ్యెల్సీ కవిత కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
మరోవంక, కెసిఆర్ శుక్రవారం ఝార్కండ్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో గాల్వాన్ అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పు న పరిహారం ఇవ్వనున్నారు. 2020 జూన్ 15న చైనా సైని కులతో జరిగిన ఘర్షణల్లో మన చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్‌బాబుతో సహా మరో 19 మం ది వీరమరణం పొందారు.
దీనిపై ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్లు, మిగతా 19 మం ది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థి కసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన సిఎం కెసిఆర్ పరిహారంతో పాటు ఆయన సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.
మిగిలిన 19 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది . ఈ నేప థ్యంలో సిఎం కెసిఆర్ నేరుగా వెళ్లి ఆ కుటుంబాలకు పరిహారం అందించనున్నారు.