భారత్-శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ రెండో టెస్టులోనూ భారత్ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో 238 పరుగుల తేడాతో బారత్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
భారత్ ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ చక్కని ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మకు కెప్టెన్గా ఇది తొలి టెస్టు విజయం. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిసినా ఫలితం దక్కలేదు.
ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయస్ అద్భుతమైన షాట్లతో అలరించారు. మరో ఆటగాడు అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో కూడా రాణించారు.
అయ్యర్ తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు సాధించారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులకు ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగలకే కుప్ప కూలింది.
143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారీ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక ఓటమి పాలైంది.