ఉక్రెయిన్‌పై ప్రస్తుతం రష్యా జరుపుతున్న యుద్ధం వల్ల కలిగే విషాదాలకు, ప్రాణ నష్టాలకు రష్యాను జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా ప్రధానిస్కాట్ మారిసన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం జరిపిన వీడియో సమావేశంలో ఐరోపాలో భయానకమైన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు తమ ప్రాంతంలో తలెత్తరాదని అప్రమత్తం చేశారు.
స్వేచ్ఛా, పారదర్శక, సంపద్వంతమైన ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి భావ సారూప్యత కలిగిన ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం కీలకమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండో పసిఫిక్‌కి సంబంధించి ఐరోపాలో జరిగిన పరిణామాల పర్యవసానాలపై చర్చించేందుకు ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశం ఒక అవకాశానిు కల్పించిందని చెప్పారు.
ఇటువంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడానికి క్వాడ్‌లో భారత్ నాయకత్వానిు మారిసన్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య గల సహకార స్థాయి గణనీయమైనదని, ఇది ఇంకా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్, ఆస్ట్రేలియా సంబంధాల్లో కీలక రంగాల గురించి మోదీ మాట్లాడుతూ, ఇరు పక్షాల ఆర్థిక భద్రత, ఆర్థిక పునరుద్ధరణకు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సిఇసిఎ) కుదరడం చాలా కీలకం కాగలదని చెప్పారు. క్వాడ్‌లో మన మధ్య మంచి సహకారం వుందని, అలాగే స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్ పట్ల మన నిబద్ధతను ఈ సహకారం ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, సుస్థిరతకు క్వాడ్ విజయవంతమవడం చాలా కీలకమని చెబుతూ గత కొనేుళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, సైన్స్ అండ్ టెకాులజీ రంగాల్లో సనిుహిత సహకారం ఉందని పేర్కొన్నారు.
పునర్వినియోగ ఇంధనం, కోవిడ్ పరిశోధన, జల వనరుల నిర్వహణ, ఖనిజాలు వంటి ఇతర అనేక రంగాల్లో కూడా సహకారం విస్తృతమైందని కూడా చెప్పారు. ఇరు దేశాల మధ్య వార్షిక సదస్సు నిర్వహణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల క్రమం తప్పకుండా సంబంధాలపై సమీక్ష చేసుకోగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.