టిడిపి ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్ప్తెవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోపణలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సభా కమిటీని వేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కమిటీలో సభ్యుల వివరాలు ఒకటి, రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆయన చెప్పారు.
సోమవారం ఉభయ సభల్లోనూ అధికార వైసిపి సభ్యులు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. దీనిపై పూర్తిస్థాయి చర్చ జరపాలనికోరుతూ పభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి శాసనసభలో స్పీకర్‌కు నోటీస్ ఇచ్చారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చర్చ జరపాలని కోరారు. దీంతో స్వల్పకాలిక చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు. అప్పటికే టిడిపి సభ్యులను సస్పెండ్ చేసి ఉండటంతో సభలో చర్చ ఏకపక్షంగా సాగింది.
వైసిపి సభ్యులు అంబటి రాంబాబు, అబ్బయ్య చౌదరి, గుడివాడ అమర్నాథ్ తదితరులు మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ధ్వజమెత్తారు. అప్పట్లోనే వైసిపి తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర హోమంత్రికి కూడా ఫిర్యాదు చేసిందని చెప్పారు.
ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ శాసనసభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తీవ్రంగా తీసుకోవాల్సిఉందని స్పష్టం చేశారు. దేశ భద్రత, ప్రాధమిక హక్కులు, వ్యక్తిగత గోప్యత తదితర అంశాలతో ఈ వ్యవహారం ముడిపడి ఉందని పేర్కొన్నారు. 2017లో డ్రోన్లు కొనుగోలుకు రూ 25 కోట్లు ఖర్చు అవుతుందంటూ అప్పటి డిజిపి హోంశాఖకులేఖ రాశారని చెప్పారు.
అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరావు అధికారులతో కలిసి ఇజ్రాయిల్‌లో పర్యటించారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాలపై అనేక అనుమానాలునాుయని, హౌస్ కమిటీ వేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం సభా కమిటీనివేస్తునుట్లు స్పీకర్ ప్రకటించారు.
మండలిలో వైసిపి ఎమ్మెల్సీలు డొక్క మాణిక్య వరప్రసాద్, ఇక్బాల్, మొండితోక అరుణ్‌కుమార్, విక్రాంత్, భరత్ తదితరులు ఈ విషయంపై మాట్లాడారు. ఆ సమయంలో మండలిలోనే ఉను టిడిపి సభ్యులు సారా మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బిజెపి సభ్యుడు మాధవ్ ఏ నిబంధన కింద చర్చకు అనుమతించారని ప్రశ్నించారు.