ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించకుండా, తటస్థ వైఖరి ఆవలంభిస్తున్న భారత్ పట్ల అమెరికా, ఐరోపా దేశాలలో నెలకొన్న అసంతృప్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాటలలో మొదటిసారిగా బహిర్గతమైంది. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని ఆయన విమర్శించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను శిక్షించే పాశ్చాత్య ఆంక్షలను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ `భారత్ ‘కొంతవరకు వణుకుతోంది’ అని పేర్కొన్నారు. బిజినెస్ రౌండ్‌టేబుల్ సీఈఓ క్వార్టర్లీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిగా చేసే విషయంలో అమెరికా, ఇతర మిత్రదేశాలలో భారతదేశం ఒక మినహాయింపుగా నిలుస్తుందని బిడెన్ సూచించారు.
రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని చెప్పారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు.
భారత్‌లో స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు కనిపించట్లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. క్వాడ్ సభ్య దేశాల్లో కూడా భారత్ అలాగే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి.
జపాన్, ఆస్ట్రేలియా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. జపాన్ చాలా బలంగా ఉందని చెబుతూ బైడెన్.పుతిన్ దూకుడు విషయంలో ఆస్ట్రేలియా కూడా అలాగే ఉందని బైడెన్ కొనియాడారు. బిడెన్ తన వ్యాఖ్యలలో ఉక్రెయిన్‌పై తన దండయాత్రకు ప్రపంచ ప్రతిస్పందనలో నాటో, పాశ్చాత్య మిత్రదేశాలు ఎంత ఐక్యంగా ఉంటాయో పుతిన్ ఊహించలేడని స్పష్టం చేశారు.
ఈ యుద్ధంలో రష్యా వైఖరిని తప్పు పడుతూ వస్తున్నాయని చెబుతూ రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగివున్న భారత్.. రష్యాతో వైరం ఏ మాత్రం కోరుకోవట్లేదని ఆయన తెలిపారు. అలాగనీ- యుద్ధాన్ని గానీ, ఈ విషయంలో రష్యాను గానీ సమర్థించట్లేదని, తటస్థంగా ఉంటోందని చెప్పారు.
కాగా, గత వారం భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడా సహితం ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించగా, పక్కన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయమై మౌనం వహించారు. తాజాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తో జరిగిన వర్చ్యువల్ సమావేశంలో కూడా ఆయన రష్యా దాడిని ప్రస్తావిస్తూ, విమర్శలు గుప్పించిన మోదీ స్పందించలేదు.