ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆహార, ఇంధన సంక్షోభం పెచ్చరిల్లుతోందని జి 7 దేశాలు హెచ్చరించాయి. పేద దేశాలను ఈ పరిస్థితులు మరింతగా దెబ్బతీస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఓడరేవుల్లో చిక్కుకుపోయిన ఆహార ధాన్యాల ఎగుమతులు సత్వరమే జరిగేలా చూసేందుకు అత్యవసర చర్యలు అవసరమని స్పష్టం చేశాయి.
జర్మనీలోనిబాల్టిక్ సముద్ర తీరంలో మూడు రోజుల పాటు జరిగిన సమావేశానంతరం జి 7 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్లో మాస్కో చర్యలను సమర్ధించడం ద్వారా లేదా అంతర్జాతీయ ఆంక్షలను దెబ్బతీయడం ద్వారా రష్యాకు సాయపడవద్దంటూ చైనాను కోరాయి.
”చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆహార, ఇంధన సంక్షోభాల్లో ఒకటి, ఇటీవల రష్యా దూకుడు చర్య వల్ల తలెత్తింది. అంతర్జాతీయంగా సునిుతమైన ప్రాంతాలను దెబ్బతీస్తోంది.” అని ఆ ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ ఆహార భద్రతను పరిరక్షించేందుకు, ఇందుకు సంబంధించి అత్యంత తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలబడేందుకు సమన్వయంతో కూడిన బహుముఖ ప్రతిస్పందనను వేగిర పరచాలని నిర్ణయించామనిపేర్కొంది.
ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి మద్దతుగా నిలవాల్సిందిగా చైనాను జి 7 కోరింది. అంతేకానీ రష్యా దూకుడును సమర్ధించేలా వ్యవహరించారని హితవు చెప్పింది. ఉక్రెయిన్పై రష్యా సాగించే యుద్ధానిు చట్టబద్ధం చేయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సహా ఇతర మార్గాలను అనుసరించ రాదంటూ చైనాను ఆ దేశాలు కోరాయి.
ఆఫ్ఘనిస్తాన్లో నెలకొను పరిస్థితులు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆహార ధాన్యాల సరఫరాపై గల చిక్కులను తొలగించేందుకు రష్యాతో చర్చించేందుకు తాను సిద్ధంగా వునాుమని శుక్రవారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొనాురు.
రష్యాతో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా వున్నామని, కానీ మాస్కో నుండి సానుకూల స్పందన లేదని ఆయన తెలిపారు. పుతిన్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదంటూ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షుల్జు ఒక ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు.