చైనా వైమానిక దళం భారత భూభాగానికి సమీపంలో ఉన్న ప్రధాన స్థావరం వద్ద యుద్ధ విమానాల మోహరింపును రెట్టింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులో ఫైటర్ జెట్లు దిగేందుకు వీలుగా చైనా ఎయిర్‌బేస్‌లను నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ ఫ్లిన్ విడుదల చేశారు.
చైనా వైమానిక దళం హోటాన్‌లోని ప్రధాన స్థావరం నుండి పనిచేస్తోంది. వారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 యుద్ధ విమానాలను మోహరించారు. ఇంతకు ముందు ఉంచిన దానికంటే ఇది చాలా ఎక్కువ అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
తూర్పు లద్దాఖ్ సెక్టార్‌కు సమీపంలో ఉండే హోటన్ ఎయిర్ బేస్‌లో 25 ప్రధాన శ్రేణి యుద్ధ విమానాలను మోహరించింది. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం.. చైనీస్ ఎయిర్‌ఫోర్స్ 25 ప్రధాన శ్రేణి ఫైటర్ జెట్స్‌ని హోటన్ ఎయిర్ బేస్‌లో సిద్ధంగా ఉంచింది. విమానాల్లో జే-11, జే-20 ఫైటర్లు వంటి అధునాతన జెట్స్ ఉన్నాయని సమాచారం.
గతంలో ఇక్కడ మిగ్-21 శ్రేణి ఫైటర్లను తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంచేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ సామర్థ్యం కలిగిన న విమానాలను పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంచడం గమనార్హం. అయితే.. చైనా చేపడుతున్న నిర్మాణాలు, యుద్ధ విమానాల మోహరింపును భారతీయ ఏజెన్సీలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, ఎటువంటి సంఘటననైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.
కాగా, చైనా షాక్చేలో కొత్త యుద్ధ విమానాల స్థావరాన్ని కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశంతో ఎల్‌ఎసి తో పాటు చైనీస్ వైమానిక దళాన్ని మరొంత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, భారత వైమానిక దళం తమ కంటే వేగంగా యాక్షన్ చేపడుతుందని చైనీయులు గ్రహించారని, అందుకే కొత్త ఎయిర్బేస్లని ప్రారంభించారని భారత సైనికాధికారులు భావిస్తున్నారు.
చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇటీవలి కాలంలో అనేక స్థావరాలను అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో అనేక షెల్టర్ల నిర్మాణం, రన్‌వేలను పొడిగించడం.. అదనపు బలగాలను మోహరించడం, రోడ్లను మరింతగా డెవలప్ చేయడం వంటివి ఉన్నాయి.
అయితే.. భారతీయ పర్యవేక్షణలో ఉన్న సైనిక వైమానిక స్థావరాలలో తూర్పు లడఖ్ ఎదురుగా మూడు ఉన్నాయి. – కష్గర్, హోటాన్, న్గారి గున్సా. ఇతర స్థావరాలలో షిగాట్సే, లాసా గోంగ్కర్, న్యింగ్చి, చమ్డో పంగ్టా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
చార్లెస్ ఎ ఫ్లిన్ ఇటీవల జరిపిన తన భారత పర్యటన సందర్భంగా పలు కీలక అంశాలను వెల్లడించాయిరు. లడఖ్ ఏరియాలో భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా నిర్మిస్తున్న రక్షణ మౌలిక సదుపాయాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసిందని ఫ్లిన్ పేర్కొన్నాడు. కాగా, భారత్ – అమెరికా సంబంధాలు “చైనీయుల అవినీతి ప్రవర్తనకు ప్రతిఘటనగా” పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.