రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. 10 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్ ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు ఐసిస్ ఉగ్రవాదకు సంస్థకు లేదా పాక్ ఉగ్రవాద సంస్థకు లింకులున్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మాత్రం ఈ ఘటనను ‘పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య’గా భావిస్తోంది.
ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కన్హయ్య లాల్ తేలి దారుణ హత్య కేసు కేసులో అంతర్జాతీయ లింక్‌ల ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అధికారులను కోరారు.
దారుణమైన హత్యోదంతంపై రాష్ట్రంలో వ్యక్తమైన ఆగ్రహంతో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి.దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయపూర్ నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ విధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఇలా ఉండగా, మదర్సాలలో నేర్పే పాఠాలే ముస్లిం పిల్లలను నేర ప్రవృత్తిలోకి నెట్టివేస్తున్నాయని, అందులో భాగంగానే ఉదయ్‌పూర్ వంటి దారుణాల జరుగుతున్నాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయ్‌పూర్ శిరచ్ఛేదం కేసుపై బుధవారం స్పందిస్తూ మదర్సాలలో దైవదూషణ చేసిన వారికి శిక్షగా శిరచ్ఛేదం చేయాలని పిల్లలకు బోధిస్తున్నారని, అందువల్లే ఇట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తోందని తెలిపారు.
మదర్సాలలో వారికి ఇది దేవుని చట్టంగా బోధిస్తున్నారు.ఈ బోధనలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్ష్టం చేశా రు. ఇట్లాంటి లక్షణాలతోనే నేటి తరం యువత మదర్సాల నుంచి బయటికి వస్తోందని, దీనికి తాము చింతిస్తున్నట్టు తెలిపారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా మదర్సాలలో నేర్పే పాఠాలపై సమీక్ష చేయాల్సి అవసరం ఉందని, పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.