భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బిఎ.2కి ఉపరకమైన కొత్త సబ్ వేరియంట్ బిఎ.2.75ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తెలిపింది. బిఎ.2.75 లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 30 శాతం పెరిగింది.
డబ్ల్యుహెచ్‌ఒకు చెందిన ఆరు సబ్రీజియన్లలో నాలుగు ప్రాంతాల్లో గతవారంలో కేసులు పెరిగాయని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ అధ్నామ్ గాబ్రియేస్ పేర్కొన్నారు. యూరప్, అమెరికాల్లో బిఎ.4, బిఎ.5 వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని, భారత్ వంటి దేశాల్లో కొత్త సబ్ వేరియంట్ బిఎ..75 వ్యాప్తిని గుర్తించామని పేర్కొన్నారు.
అయితే, పరిమిత స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుండటంతో విశ్లేషణకు పూర్తి సమాచారం అందుబాటులో లేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గతవారం 4.6 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పొలిస్తే మరణాలు 12 శాతం మేర తగ్గాయని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌పై డబ్ల్యు హెచ్ఒ శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్ మాట్లాడుతూ బిఎ.2.75 అని పిలిచే ఉప వేరియంట్‌ను భారత దేశంలో మొదట గుర్తించామని, అనంతరం 100 దేశాల్లో గుర్తించామని తెలిపారు. ఈ వేరియంట్‌పై పరిమిత సమాచారం అందుబాటులో ఉందని చెప్పారు.
ఈ ఉప వేరియంట్ స్పైక్ ప్రోటీన్, రిసెప్టర్ బైండింగ్ కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఈ సబ్ వేరియంట్ మానవ రోగనిరోధక శక్తిపై ఎలా దాడి చేస్తుందో అనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని వివరించారు.