బ్రిటిష్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో, ఆ పదవి కోసం పోటీపడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ కు భార్య గండం ఎదురవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆమె విదేశీ సంబంధాలు, ఆదాయాలపై ఏర్పడిన వివాదాలు గతంలో ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి.
తాజాగా, ఆయన భార్య, బిలియనీర్ అక్షత మూర్తి జర్నలిస్టులకు టీ అందించడం అందించడం సహితం వివాదం రేపింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతున్నది. తమ నివాసం వద్ద ఉన్న జర్నలిస్టులకు ఆమె టీ బిస్కట్లను అందిస్తూ ఉండగా అసలు వివాదానికి దారితీసింది.
జర్నలిస్టులకు ఆమె అత్యంత ఖరీదైన ఒక్కొక్కటి 38 పౌండ్లు విలువ పలికే ఎమ్మా లెసి టీకప్పులలో టీ అందించారు. టీ కప్పులకే ఇంతటి ఖర్చా? ఎందుకింత విలాసం? దిగిపోయిన ప్రధాని జాన్సన్ తరహాలోనే ఈ కుటుంబం డబ్బులు వెదజల్లుతుందా? అని నెట్లో పెట్టిన ఫోటోలపై తీవ్రస్థాయి దుమారం రగులుకుంది.
రుషి సునాక్ ప్రతి టీ కప్పునకు ఇంత డబ్డు పెడితే అక్షత ఈ పద్థతి చూస్తూ ఉంటే ఆమె కూడా జాన్సన్ భార్యను అనుకరిస్తూ ఉన్నట్లుందని ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. ఈ టీకప్పులకు అయ్యే ఖర్చుతో ఓ కుటుంబానికి రెండు రోజుల పాటు తిండి పెట్టొచ్చు అని మరొకరు స్పందించారు.
ఈ విధమైన తంతుతో సునాక్ కూడా నిజాల పట్ల పెడచెవిని పెడుతున్నట్లు ఉందని మరో వ్యక్తి విమర్శించారు. చాలా రోజుల క్రితమే భారత పౌరసత్వం గల మహిళ, ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ మూర్తి కూతురు అయిన అక్షత పన్నుల ఎగవేత వార్తలలో చేరి, భర్త సునాక్ రాజకీయ జీవితానికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మగ్ల వివాదానికి తెరతీశారు.
పన్నుల మోతలు, జీవన వ్యయం పెరగడం, అవకతవకల విధానాలు, నేతల లగ్జరీ జీవిత విధానాలు ఇవన్నీ కలిపి జాన్సన్ ప్రభుత్వం పట్ల జనంలో నిరసనలు తలెత్తాయి. ఇది చివరికి పరోక్షంగా ఆయన నిష్క్రమణకు దారితీసింది. ప్రతిపక్షాలు చాలా కాలంగా అక్షత్ మూర్తి దేశీయేతర పన్నుల స్థాయిపై విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికీ భారతీయ పౌరురాలిగానే ఉన్న అక్షత నికర ఆస్తుల విలువ 1.2 బిలియన్ డాలర్లు వరకూ ఉంది. ఆమెకు తండ్రి నెలకొల్పిన ఇన్ఫోసిస్లో షేర్ల విలువ ఇది.