టీచర్ల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన అయిదు బ్యాంకు ఖాతాలను జప్తు చేసే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ బ్యాంకు ఖాతాల్లో రూ 2 కోట్లకు పైగా నగదును ఇడి అధికారులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా అర్పితా ముఖర్జీ నిర్వహిసున్నట్లుగా భావిస్తున్న పలు షెల్ కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు కూడా ఇడి దృష్టిలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ షెల్ కంపెనీల్లో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో మాత్రం ఆయన చెప్పాలేదు. సంబంధిత అధికారలు నుంచి ఈ ఖాతాల వివరాలను కోరామని, అవి అందిన తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆ అధికారి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ముఖర్జీకి చెందిన కనిపించకుండా పోయిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిని ఇడి మొదలు పెట్టిన్నట్లు అ అధికారి తెలిపారు. ఈ కార్లలో రెండు కార్లు ఒకటి మెర్సిడెజ్ బెంజ్, మరోటి మినీ కూపర్ మంత్రి, అర్పితా ముఖర్జీ తరచూ జాయ్ రైడ్స్‌కు ఉపయోగించే వారని, కార్లలోనే అర్పిత పార్టీలు కూడా చేసుకునే వారని ఆయన తెలిపారు.
అర్పిత కారును పార్థ చటర్జీ మరో కారులో వెంబడించే వారని, కొంత దూరం వెళ్లాక ఆయన ఆమె కారులోకి మారి జాయ్ రైడ్‌కు వెళ్లే వారని ఆ అధికారి చెప్పారు. ఈ కార్లన్నీ కూడా 2016- 2019 మధ్య కొనుగోలు చేశారని కూడా ఆ అధికారి చెప్పారు. ఒక కారును పార్థ చటర్జీ ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడని, మిగతా కార్లు కొనుగోలు చేయడానికి సాయం చేశారని తెలిపారు.