ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల ద్వారా సామాజికంగా నిరాదరణకు గురైన, ఇన్నేళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా మాత్రమే దేశంలో సమానమైన, సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది.
“జన్‌ధన్ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్‌ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేశాం. ప్రతి కుటుంబమే కాదు ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫలాలు అందాయి” అని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
- 2022 ఆగస్టు 10వ తేదీ నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాల సంఖ్య : 46.25 కోట్లు; 55.59% (25.71 కోట్లు) జన్-ధన్ ఖాతాదారులు మహిళలు; 66.79% (30.89 కోట్లు) గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ఖాతాలే
- స్కీమ్ ప్రారంభించిన ఏడాదిలోనే ప్రారంభమైన పిఎంజెడివై ఖాతాలు 17.90 కోట్లు
- పిఎంజెడివై కింద నిరంతరాయంగా పెరుగుతున్న ఖాతాలు
- పిఎంజెడివై ఖాతాల సంఖ్య 2015 మార్చిలో 14.72 కోట్ల నుంచి 10-08-2022 నాటికి 46.25 కోట్లకు పెరుగుదల; ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో నిస్సందేహంగా అద్భుతమైన ప్రయాణం
- పిఎంజెడివై ఖాతాల్లో మొత్తం నగదు డిపాజిట్ బ్యాలెన్స్ రూ.1,73,954 కోట్లు
- డిపాజిట్లలో 7.60 రెట్లు, ఖాతాల్లో 2.58 రెట్లు వృద్ధి (2022 ఆగస్టు/ 2015 ఆగస్టు)
- ఖాతాల్లో సగటు డిపాజిట్ రూ.3,761
- 2015 నుంచి ప్రతీ ఖాతాలోను సగటు డిపాజిట్ 2.9 రెట్లు పెరుగుదల
కనీస బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందుకోగల భాగ్యం లేని అల్పాదాయ వర్గాలు, బలహీన వర్గాలకు సరైన సమయానికి, సరసమైన ధరల్లో అవసరమైన సేవలు అందుబాటులో ఉంచడమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్.
పేదల పొదుపు మొత్తాలను వ్యవస్థీకృత ఫైనాన్షియల్ వ్యవస్థలోకి రప్పించడం, గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న తమ కుటుంబాలకు డబ్బు పంపగలిగే వ్యవస్థను అందుబాటులోకి తేవడం అత్యంత కీలకం. ఈ దిశగా తీసుకున్న చొరవే ప్రధానమంత్రి జన్-ధన్ యోజ (పిఎంజెడివై). ప్రపంచంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం ఇది.
2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎంజెడివై పథకాన్ని ప్రకటించారు. ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తూ పేదలకు విషవలయం నుంచి విముక్తి లభించే సందర్భంగా దీన్ని వేడుక చేసుకోవచ్చునని తెలిపారు.
పిఎంజెడివైపై ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరడ్ తన ఆలోచనలు పంచుకుంటూ “భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోను సమాజంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరేందుకు తీసుకున్న ప్రధాన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) ఒకటి అని తెలిపారు. సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించడం ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు.
పేదప్రజలు తమ పొదుపును వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు, దూరంగా ఎక్కడో గ్రామాల్లో నివశిస్తున్నతమ కుటుంబీకులకు వబ్బు పంపడానికి, వారు వడ్డీ వ్యాపారుల ఉక్కు వలయం నుంచి బయటపడేందుకు దోహదపడే సాధనం అని తెలిపారు.
ఈ పథకం 8వ వార్షికోత్సవం దాని ప్రాధాన్యతను చాటి చెబతోంది. ప్రభుత్వ ప్రజాకూల ఆర్థిక విధానాలకు ఇది పునాదిగా నిలిచింది. ప్రత్యక్ష నగదు బదిలీ, కోవిడ్-19 ఆర్థిక సహాయం, పిఎం-కిసాన్, ఎంజిఎన్ ఆర్ఇజిఏ, జీవితబీమా, ఆరోగ్య బీమా కవరేజి…ఇలా అన్నింటికీ ఇది మూలంగా నిలిచింది.
ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతీ ఒక్క వయోజనునికి బ్యాంకు ఖాతాలు అందించడం అనేది ఇంచుమించుగా పూర్తయింది అని కరడ్ చెప్పారు. బ్యాంకులు ప్రస్తుత వాతావరణానికి అనుకూలంగా స్పందిస్తాయని జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ చొరవను మరింతగా ముందుకు నడపడానికి మరింత కృషి చేస్తాయని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతీ ఒక్క వయోజనుని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో భాగస్వామిని చేయడానికి పునరంకితం అవుతాయని నాకు విశ్వాసం ఉంది అని కరడ్ తెలిపారు.