ఆసియా కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (68) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతులను ఎదుర్కొన్న యాదవ్ ఆరేసి ఫోర్లు, సిక్సర్లతో 68 పరుగులు పిండేశాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(36), రోహిత్ శర్మ (21) త్వరగానే అవుట్ అయిన ఆతరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(59) తనదైన శైలిలో బ్యాటిగ్ చేసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు.
కోహ్లీకి జత కలిసిన మరో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో 68 పరుగులు చేసి ఔరా అనిపించాడు. హాంకాంగ్ బౌలింగ్‌లో హరూన్ అర్షద్ కేవలం 3 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు.
మరో బౌలర్ ఆయుశ్ శుక్లా 4 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు. చివరలో బౌలింగ్‌కు దిగిన మహ్మద్ ఘజ్జన్ఫర్ 2 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు. స్పిన్నర్ యాసిమ్ ముర్తజా (0/27), మహ్మద్ గజన్ఫార్ (1/19) కాస్త పర్వాలేదనిపించారు.
ఛేదనలో హాంగ్‌కాంగ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి హాంగ్‌కాంగ్‌ను కట్టడి చేశారు. భువనేశ్వర్, అర్షదీప్, జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్‌లో బాబర్ హయత్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తూఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.