దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏపీఏ చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించినట్లు సమాచారం. సంస్థపై నిషేధం ఉండటంతో… పీఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు భావిస్తున్నాయి.
గత వారం రోజులుగా ఈ సంస్థ కార్యకలాపాలపై ఎన్ఐఐ దాడులు ఉద్ధృతం కావించడం తెలిసిందే. మంగళవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈడీతో కలిసి ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్న 150 మందికి పైగా కార్యకర్తలను నిర్బంధించారు. గత వారం రోజులలో ఈ దాడుల్లో మూడోసారి కావడం గమనార్హం.
మూడోసారి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్ఎస్ఎస్, బిజెపి ముఖ్యనేతల హత్యకు కుట్ర జరిగినట్టు అభియోగాలు వస్తున్నాయి. పాట్నాలో ప్రధాని హత్యకు కుట్ర చేసినట్టు ఎన్ఐఎ ఆరోపణ చేస్తుంది. ఆరు నెలల్లోనే పిఎఫ్ఐ సంస్థల అకౌంట్లలో రూ.120 కోట్లు జమయ్యాయి. విదేశాల నుంచి పిఎఫ్ఐ భారీగా డబ్బులు సేకరించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ సందర్భంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం శిక్షణలు, విదేశీ నిధుల సమీకరణలతో పాటు ప్రముఖులను అంతం చేసేందుకు హిట్ లిస్ట్ లు తయారు చేసిన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయని చెబుతూ ఉండడంతో ఈ సంస్థపై నిషేధం తప్పదని తెలుస్తున్నది. ముస్లిం తీవ్రవాద సంస్థగా పరిగణిస్తున్న ఎన్ఐఎ దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలు, నేతలను అదుపులోకి తీసుకుంటుంది.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాల పోలీసులు కూడా సహకరించడంతో ఎన్ఐఎ సోదాలు వేగవంతం చేసింది. 25 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో 10 మందిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 57మందిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో 30 మంది, 21 మంది, 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు కర్ణాటకలో అదుపులోకి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారని అడిషనల్ లెఘైక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
కాగా పిఎఫ్ఐ సంస్థ కేరళలో ఏర్పడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పిఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ సందర్భంగా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న పిఎఫ్ఐను కేంద్ర ప్రభుత్వ నిషేధించాలని కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిజాముద్దీన్, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సంబంధం ఉన్న అరెస్టు చేశామని పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు దాడులు నిర్వహించిన ప్రాంతాల్లో బలగాలను మోహరించామని మధ్యప్రదేశ్‌లోని జిల్లాల్లో సంబంధాలు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మధ్యప్రదేశ్ హోం మంత్రి మిశ్రా తెలిపారు.
యాంటి టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్), ఎన్ఐఎ దాడి చేసి గుజరాత్లో పదిమందిని తీసుకున్నారు. పిఎఫ్ఐకి చెందిన రాజకీయ పార్టీ డెమొక్రటిక్ ఆఫ్ ఇండియా నెలల క్రితమే అహ్మదాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది.