గత ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని, రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరీ సమాధానం చెప్పారు. దేశీయంగా వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి 2,34,912 కోట్లు, విదేశీ సంస్థల నుంచి 2,835 కోట్ల అప్పులు తీసుకుందని వెల్లడించారు.
నవంబర్ 30, 2021 వరకు మొత్తం తెలంగాణ అప్పులు 2,37,747 కోట్లుగా ఉందని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఇందులో రూ. 2,835 కోట్లు విదేశాల నుంచి తీసుకున్న రుణాలున్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో విదేశీ రుణాల రూపంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి అదనపు సహాయం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.382.21 కోట్ల మేర విదేశీ రుణాలు, రూ. 147.53 కోట్ల మేర వడ్డీ చెల్లింపులు జరిపిందని వెల్లడించారు. జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి తెలంగాణ రుణాలు తీసుకుందని తెలిపారు.