ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా భారత మహిళా షట్లర్ పివి సింధు ఎంపికైంది. బిడబ్ల్యుఎఫ్ 2021-25 ఐదేళ్ల కాలానికి ఆరుగురు సభ్యులతో సభ్యులను ఎంపిక చేయగా అందులో సింధు ఒకరు.
సింధుతోపాటు ఇరిస్ వాంగ్(అమెరికా), రాబిన్ తలబెలింగ్(నెదర్లాండ్స్), గ్రేసియా పొల్లి(ఇండోనేషియా), కిమ్ సొయాంగ్(కొరియా), జంగ్ సి వురు(చైనా) ఎంపికైనట్లు బిడబ్ల్యుఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బిడబ్ల్యుఎఫ్ కమిషన్ ఛైర్ అండ్ డిప్యూటీ ఛైర్ సభ్యులు ఆరుగురు షట్లర్లను ఎంపిక చేశారు.
పివి సింధు ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించి చరిత్రను సృష్టించడం.. అథ్లెట్స్ కమిషన్ మెంబర్గా ఎంపికకు ప్రధాన అర్హతగా అందరికంటే ముందువరుసలో నిలిచినట్లు ఛైర్ సభ్యులు తెలిపారు. అలాగే ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండు రజితాలు, మరో రెండు కాంస్యాలతోపాటు 2019లో స్వర్ణ పతకం సాధించడం కూడా సింధు ఎంపికకు దోహదపడ్డాయి.