దేశంలో మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్దరించి ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు. అందులో భాగంగా రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో ఈనెల 12న ప్రధానమంత్రి రామగుండం వచ్చి కర్మాగారాన్ని జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పారు.
బుధవారం ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో సమీక్ష జరిపారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమిక ల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) పరిశ్రమను పరిశీలించారు. కర్మాగారంలో కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, సైలోలను పరిశీలించారు. ప్రధాని రూట్ మ్యాప్‌లో ఎక్కడె క్కడ ఎంతసేపు పరిశీలన చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంత రం పరిశ్రమలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగదర్ ఎంపీ బండి సంజయ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. షట్‌డౌన్ తరువాత పరిశ్రమ వంద శాతం ఉ త్పత్తి సాధిస్తుందని, ఈ ఏడాది ఇప్పటికే 5లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని అధికారులు వివరించారు.
ప్రధాని పర్యటనకు పూర్తి స్థాయి ఏర్పాట్లుచేయాలని, ఎక్కడా లోటు ఉండవద్దని అధికారులకు సూచించారు. భగవంత్ఖుబా ఎన్టీపీసీ హెలీప్యాడ్, బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్ఎఫ్ సీఎల్ ఏటా 12.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోందని, 100 శాతం ఉత్పాదన జరుగుతోంది కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పాటు అదే రోజు జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రధాని రాక నేపథ్యంలో తెలంగాణలో మూడు జాతీయ రహదారులతో పాటు కొత్తగూడెం-సత్తుపల్లి గూడ్స్ రైలును జాతికి అంకితం చేయబోతున్నారు. అదే రోజు ఎన్టీపీసీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరై తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ నివాసంలో కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రధాని పర్యటన పూర్తి అధికారికమ ని, సమీప జిల్లాల నుంచి రైతులను సభకు తీసుకురావాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన అభివ్రుద్ధి పనులకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకోవడం ఏమాతర్రం సమంజసం కాదని బండి సంజయ్ టిఆర్ఎస్, వామపక్షాలకు హితవు చెప్పారు.
రైతాంగానికి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 75 అసెంబ్లీ కేంద్రాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రధాని సభను వీక్షించేలా చేస్తున్నామని ప్రధాని తెలిపారు.