సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ – రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, ఎగ్మూర్, చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిరిపులియూర్, చిదంబరం, శీర్గాళి, మైలాడుదురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, ఆదిరాంపట్టినం, పట్టుకోట్టయి, ఆరంతాంగి, కారైక్కుడి, శివగంగ, మానామధురై స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఆయా రోజుల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (07696) ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 9.50 గంటలకు రామనాథపురంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది.