ప్రపంచంలోనే అత్యంత అభద్రత కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్ అని ఖామా ప్రెస్ మంగళవారం వెల్లడించింది. ఆఫ్గనిస్తాన్‌లోని ప్రధానమీడియాగా ఉన్న ఖామా ప్రెస్.. ఆ దేశ అభద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ పీస్ అండ్ ఎకనామిక్స్ (ఐఇపి) నివేదికను ఖామా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జిపిఐ) ప్రతి ఏడాది 163 దేశాల్లో శాంతి భద్రతల సూచికను వెల్లడిస్తుంది. ఈ సంస్థ వార్షిక నివేదిక ప్రకారం తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి కూడా ఆఫ్ఘనిస్తానే 163వ స్థానంలో నిలిచింది.
కాగా, ఖామా వెల్లడించిన నివేదికలో ప్రపంచంలో శాంతియుత వాతావరణంలో సురక్షితంగా, అభద్రతకు లోనవ్వకుండా నివశించే దేశంగా మొదటిస్థానంలో ఐస్లాండ్ నిలిచింది. ఆ తర్వాత అంతర్జాతీయ శాంతి సూచికల ప్రకారం.. న్యూజిలాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్లు నిలిచాయి. మొదటి పదిస్థానాల్లో సింగపూర్ రెండవస్థానం, జపాన్ పదో స్థానంలో నిలిచాయని ఖామా నివేదిక వెల్లడించింది.