దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది.
ఎన్టీఆర్-రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలోని ఈ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్‌లో నామినేషన్ సాధించి చరిత్ర సృష్టించింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలా భైరవ పాడారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారత సిినిమాగా నిలిచింది.
ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001). ఫలితం తెలియాలంటే మార్చి 13, 2023 వరకు ఆగాల్సిందే. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ అందుకున్న విషయం తెలిసిందే.
‘లాస్ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్స్‌లో బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ గాను కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది.
ఇందులో నాటు నాటు సాంగ్ కోసం విదేశీ సెలబ్రెటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడంతో ఆస్కార్ బరిలో కూడా నిలుస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టే ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది.