లండన్‌లో ఇంటి అద్దెలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లండన్‌వాసులు జీవన వ్యయంతోపాటు, విద్యుత్ ఛార్జీల పెంపుదలతో సతమతమవుతున్నారు.
తాజాగా గృహ యజమానులు గతేడాది కంటే ఈ ఏడాది ఇంటి అద్దెలు పెంచడానికి మొగ్గుచూపుతున్నారని టెలిగ్రాఫ్ నివేదిక వెల్లడించింది. లండన్‌లో గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ. 2,50,000 ఉన్న ఇంటి అద్దె ఈ ఏడాది ప్రారంభంలో 3,000,00 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది.
కాగా, గతేడాది లండన్ కాకుండా.. మిగతా దేశాల్లో ఇంటి అద్దెలు 9.7 శాతం పెరిగాయని న్యూస్ అవుట్లెట్ నివేదించింది. ఇక లండన్‌లో 2021 తర్వాత ఇంటి అద్దెలు 9.9 శాతంతో రెండవ అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు న్యూస్ అవుట్లెట్ పేర్కొంది.ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడంతో.. అద్దెదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గృహ యజమానులు అద్దెను పెంచే అభిప్రాయాన్ని మార్చుకోవాలని ప్రాపర్టీ సైన్స్ డైరెక్టర్ టిమ్ బన్నిస్టర్ అన్నారు.
ఇలాంటి సమయంలో ఇంటి అద్దెలు ఖరీదుగా మారడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నది. భవనాలు లేదా ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటం, అద్దెలకు డిమాండ్ పెరగడంతోపాటు, ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు యజమానులు అద్దెలను పెంచేస్తున్నారు.
ప్రస్తుత పరిణామాలు ఇవే ప్రధాన కారణాలు. 2023లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ప్రాపర్టీ పోర్టల్ నివేదిక అంచనా వేసింది. కనీసంగా అద్దెలు 5శాతం పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుత అద్దెలు 2019 కంటే రెట్టింపు స్థాయిలో ఉందని రైట్మూవ్కు చెందిన టిమ్ బన్నిస్టర్ ది టెలిగ్రాఫ్‌తో చెప్పారు.