ఒడిశాలోని బ్రిజరాజ్‌నగర్‌లో ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ ఆదివారం మృతిచెందారు. ఛాతీ భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.
డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తుల వైపు దూసుకెళ్లిన బుల్లెట్ తీవ్ర గాయం చేయడంతో ఆయన మృతిచెందినట్టు ప్రకటించారు. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ దగ్గర మంత్రిపై కాల్పులు జరిగాయి.
మంత్రి నబకిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన మంత్రిని.. ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి నవీన్ పటాుయక్ నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్లి మంత్రికి అందుతును చికిత్సపై వైద్యులతో సమీక్షించారు. అవసరమైతే హైదరాబాద్, బెంగళూరు ఆసుపత్రులకుతరలించాలనికూడా చర్చ చేశారు. ఆయన కుటుంభం సభ్యులను పరామర్శించారు. కానీ చికిత్స పొందుతూనే కిశోర్ దాస్ కనుుమూశారు. కాల్పులకు జరిపిన ఏఎస్సైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఏఎస్సై కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆరోగ్యమంత్రి నబ కిశోర్ దాస్ మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మరణం తనను తీవ్ర షాక్‌కు, ఆవేదనక గురిచేసిందని చెప్పారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తి అని సీఎం తెలిపారు. ఆయన ప్రజల మనిషి అని, ప్రజలకు లబ్ది చేకూరేలా కృషి చేశారని కొనియాడారు. పార్టీని బలోపేతం చేయడంలో కిశోర్ దాస్ కీలకంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
బిజెడిలో సీనియర్ నేత అయిన నబా కిశోర్..ఇటీవల మహారాష్ట్రలోని శనిశింగనాపుర్ ఆలయానికి రూ.కోటి పైగా విలువ చేసి బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇవ్వడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2024లో అసెంబ్లీ ఎనిుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏకంగా మంత్రిపైనే కాల్పులు జరిపి హత్య చేయడంతో అధికార బిజెడి దిగ్భ్రాంతికి గురైంది.