సినీ నటుడు నందమూరి తారక రత్న 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి చివరకు శనివారం సాయంత్రం తనువు చాలించారు. నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. టిడిపి యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు.
నందమూరి తారకరత్న మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు తారకరత్న మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్లో స్పందించారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అంటూ మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, మెరుగైన వైద్యం అందింరు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు.
కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇక విదేశీ డాక్టర్లతో చికిత్సను అందించారు కుటుంబసభ్యులు.. అయినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. శనివారం ఉదయమే ఆరోగ్య పరిస్ధితి మరింత దిగజారినట్లుగా వైద్యులు వెల్లడించారు. తీవ్ర గుండెపోటుకు గురవ్వడంతో ఆయన నాడీ వ్యవస్ద దెబ్బతిన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
అప్పటి నుంచి కోమాలో ఉన్న తారకరత్నను దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వైద్యులు ప్రయత్నించారు. తొలుత కొద్ది రోజులు వైద్యానికి స్పందించిన తారకరత్న శరీరం కొద్దిరోజులుగా స్పందించడం లేదని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించడంతో నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంభం సభ్యులు శనివారమే ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో చర్చించారు.