కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేయనుంది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్‌కు సంబంధించిన మహిళా సెక్యూరిటీని వారికి నియమించినున్నట్లు విశ్వసనీయ సమాచారం. హోమ్ మంత్రి అమిత్ షా కుటుంభం సభ్యులకు కూడా మహిళా సెక్యూరిటీని నియమిస్తారు.
మొట్ట మొదటి సారిగా సీఆర్పీఎఫ్ మహిళా కమాండర్ లను విఐపి భద్రత కోసం వినియోగిస్తున్నారు. తమ మహిళా కమాండర్ల మొదటి బ్యాచ్ లో 35 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, జనవరి 15 నాటికి విధులలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. వీరి సంఖ్య తక్కువగా ఉండడంతో మొదటగా వీరిని సిఐపీల నివాసాల వద్ద ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి `మహిళల సాధికారికత’ నివ్వడంతో ప్రియాంక గాంధీ వెడుతున్న దృష్ట్యా ఆమె భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. గతంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ఎస్పీజీ భద్రతా ఉన్నప్పుడు, ఎస్పీజీ మహిళా అకమాండర్లను వారి భద్రత కోసం వినియోగించేవారు.
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను రెండేండ్ల క్రితం కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు స్పీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ కల్పిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా సోనియా, ప్రియాంక, గరుశరణ్ కౌర్‌కు సీఆర్పీఎఫ్ మహిళా సెక్యూరిటీ కల్పించనున్నట్లు సమాచారం.
ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ ఆరోపణలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.తన పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపణలు చేశారు.
అయితే ఈ విచారణలో ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాలేదని కేంద్ర అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సీఈఆర్టీ-ఇన్ ప్రాథమిక దర్యాప్తులో ఖాతాలు హ్యాక్ కాలేదని తేలిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రియాంక గాంధీ వాద్రా అధికారికంగా ఫిర్యాదు చేయక పోయినా ఆమె ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్లు చేయడంతో సొంతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తన పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ఆరోపణను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రియాంకగాంధీ ప్రస్తావిస్తూ ‘‘ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారికి వేరే పని లేదా?’’ అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.
అఖిలేష్ యాదవ్ ఆరోపణలపై యూపీ సీఎం యోగి స్పందిస్తూ.‘‘బహుశా అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ ఇలాంటివే చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారు.’’ అని ఎద్దేవా చేసారు.