మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. శివసేన పార్టీ, గుర్తు విల్లు-బాణంను సీఎం షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో థాక్రే సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ జరిగింది.
ఈ క్రమంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని థాక్రే తరపు న్యాయవాది కోరగా..అందుకు కోర్టు నిరాకరించింది. షిండే వర్గం ఈసీ ముందు మెజారిటీని నిరూపించుకుందని..కాబట్టి ఆ ఆదేశాలపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉద్ధవ్ వర్గం (బాలాసాహెబ్ థాక్రే) కాగడ గుర్తును వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కాగా శివసేన ఇటీవల ఉద్ధవ్, షిండే వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.
శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణంను పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్త్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికే దక్కుతుందని ఈసీ స్పష్టం చేసింది. అసలైన శివసేన తమదేనని షిండే 6 నెలల క్రితం పిటీషన్ దాఖలు చేయగా..తాజాగా ఆ గుర్తును షిండే వర్గానికి చెందుతుందని ఈసీ థాక్రేకు కోలుకోలేని షాకిచ్చింది.
దీనితో ఠాక్రే ఈసీ నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అసలు శివసేనను ఏర్పాటు చేసింది తన తండ్రి దివంగత బాలా సాహెబ్ ఠాక్రే. ఇందుకు సంబంధించి విల్లు-బాణం గుర్తు తమకే దక్కుతుందని ఠాక్రే కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.