ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి గతనెలలో రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ వారిలో మూడో వ్యక్తిగా అబ్దుల్ నజీర్ గుర్తింపు పొందారు.
గత రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం కొత్త గవర్నర్ దంపతులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగిన బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. బుధవారం ఉదయం కూడా మరోమారు గన్నవరం విమానాశ్రయంలో బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ఏపీ సీఎం, మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీడ్కోలు పలికారు.