శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగియగానే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు, ఎమ్యెల్సీలలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.
ఎమ్యెల్సీల ఎన్నిక పక్రియ పూర్తి కావడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియడంతో త్వరలో మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్యెల్సీ ఎవ్వరూ మంత్రివర్గంలో లేరు. కొత్తగా ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం ప్రస్తుత మంత్రులలో కొందరికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది.
సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో జరిపిన భేటీ ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ కోసమే ఆయన గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది.
ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చని మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలి ఎన్నికల్లో గెలిచిన వారికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో ఈ నెల 30 లేదా 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ఉత్కంఠతను రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా వైఎస్ జగన్ ఈ దిశగా సంకేతాలను పంపారు. నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు.