ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం జరిపిన సమావేశంలో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న కథనాలను సహితం కొట్టిపారేసారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. మంత్రివర్గ మార్పులపై పుకార్లు నమ్మొద్దని సీఎం జగన్ సూచించారు.
ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారని చెబుతూ 60 మందికి టిక్కెట్లు ఇవ్వరని వారి లిస్టు కూడా తయారుచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారని సిఎం ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏప్రిల్ 20వ తేదీలోగా ప్రతి ఇంటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రులు వివరించారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి శాసనసభ్యుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెబుతున్నారని, 21 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచామని వివరించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధిలో ఉంటారని, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారని, అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధిలో, దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుందని వివరించారు.
ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 87శాతం కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించామని, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారని వివరించారు. మరోవైపు ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని,
మరోవైపు ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, ఉమశంకర్ గణేష్ కొడాలి నాని, బాలనాగిరెడ్డి, నవాజ్ బాషా, చింతల రామచంద్ర రెడ్డి గైర్హజరయ్యారు. వీరిలో కొందరు ముందస్తు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది