ఎప్పటిలాగానే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ హాజరుకపోవడం ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ శనివారం షెడ్యూల్ బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్… కేసీఆర్ కు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని చెప్పారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రారని నిలదీశారు.
కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని మండిపడుతూ కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని సంజయ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు.
