రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పైలెట్ దుస్తులు ధరించి యుద్ధ విమానంలో కొద్ది సేపు విహరించారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోరు యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించారు. అస్సాంలోనితేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ దృశ్యం కనిపించింది. రాష్ట్రపతి త్రివిధ దళాలకుసుప్రీం కమాండర్ అను సంగతి విదితమే.
కాగా సుఖోరు విమానంలో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోరులో ప్రయాణించారు. ఆమె 2009లో పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి సుఖోరు ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు.
కాగా ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము సుఖోరు ఎంకె 301లో ప్రయాణించారు. ఇది రష్యా అభివఅద్ధి చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా లైసెన్స్‌తో నిర్మితమయ్యింది.
ద్రౌపది ముర్ము మూడు రోజుల అస్సాం పర్యటనలో భాగంగా చివరి రోజైన శనివారం సుఖోరులో ప్రయాణించారు. గౌహతి నుంచి తేజ్పూర్లోనిఎయిర్ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. ఆమెకుఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ సుప్రీం కమాండర్కుస్వాగతం పలికారు.