‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వును సందర్శించారు. సుమారు 20 కిలోమీటర్లు జీప్‌లో పర్యటించారు. అనంతరం తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను సందర్శించి ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా ఇచ్చారు.
తలపై హంటర్స్ క్యాప్ ధరించి వేటగాడి రూపంలో సఫారీ కోసం వినియోగించే కెమెరాతో కర్ణాటకలోని బండీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు. బండీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తమిళనాడు ముడుమళైకి వెళ్లారు. థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను సందర్శించారు. ఇటీవలే ఆస్కార్ అవార్డును అందుకున్న ది ఎలిఫెంట్ విష్పర్స్ డాక్యుమెంటరీ కపుల్స్ బొమ్మన్ బెళ్లిని కలుసుకున్నారు.
ఈ డాక్యుమెంటరీలో కనిపించిన రఘు అనే ఏనుగుతో కలిసి ఫొటోలు దిగారు. సాధారణంగా బొమ్మన్ బెళ్లిని పలువురు ప్రముఖులు ఇప్పటికే కలుసుకున్నారు. వారిలో ఎవరూ కూడా థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లేదు. ప్రధాని మోదీ వారికి భిన్నంగా వ్యవహరించారు. తానే స్వయంగా వారు ఉన్న ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లి మరీ పలకరించారు. విషెస్ తెలిపారు. ముడుమళై రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మళ్లీ కర్ణాటకకు చేరుకున్నారు. టైగర్ ప్రాజెక్టును ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైసూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
భారతదేశంలో పులుల సంఖ్యను ప్రధాని మోదీ ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పులుల గణన గణాంకాలను ప్రధాని విడుదల చేశారు. 2022లో దేశంలో పులుల సంఖ్య 3,167గా ఉందని తెలిపారు.
నివేదిక ప్రకారం పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167కు చేరాయి. ఈ సందర్భంగా ‘అంతర్జాతీయ పులుల కూటమిని ప్రారంభించారు. ఈ ఐబీసీఏ పులి, సింహంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏడు రకాల పులుల పరిరక్షణపై దృష్టి సారిస్తుందని చెప్పారు.
పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణాన్ని ఆవిష్కరించారు. రాబోయే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు సంబంధించిన విజన్‌ను అందించడంతో పాటు ‘అమృత్కాల్ ‘లో పులుల సంరక్షణకు సంబంధించిన బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు.