కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ 189 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి ఆర్.అశోక పద్మనాభ నగర్, కనకపుర స్థానాల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో తలపడనున్నారు. మొదటి జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులు, 32 మంది వెనుబడిన వర్గాల అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల అభ్యర్థులు ఉన్నారు.
9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8 మంది మహిళలు ఉన్నారు. రెండో జాబితా త్వరలో రానుందని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది.
కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది.