ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా గెలుచుకుంది. మొదటి రన్నర్‌గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజ, రెండో రన్నరప్‌గా మణిపూర్ కు చెందిన తౌనోజాబ్ స్ట్రెలా లువాంగ్ నిలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీలో పాల్గొనగా, ఈ ముగ్గురు మొదటి మూడు స్థానాల్లో ఎంపికయ్యారు.
2024 ప్రపంచ అందాల పోటీల్లో భారత్ తరఫున పాల్గొననున్న కర్ణాటకకు చెందిన మాజీ ఫెమినా మిస్ ఇండియా 2022 విజేత సినీశెట్టి నుంచి నందిని కిరీటాన్ని ధరించారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన మాజీ మిస్ ఇండియా 1వ, 2వ రన్నరప్ రూబల్ షెకావత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్లు వరుసగా శ్రేయా, తౌనోజామ్లకు కిరీటం ధరింప చేశారు.
ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. చివరికి, తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా విజేతగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్, అనన్య వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. అన్ని పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.